- May 26, 2025
- By gjcmadhira
- Latest News
ఖమ్మం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సన్నాహక సమావేశపు విశేషాలు
ఈ రోజు అనగా 26.05.2025 సోమవారం నాడు జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సన్నాహక సమావేశపు విశేషాలు
ఈ రోజు ఖమ్మం లో జరిగిన సన్నాహక సమావేశం చాలా చాలా బాగా జరిగింది. ఒక మినీ గెట్ టుగెదర్ లాగా జరిగింది. దాదాపు 50 నుండి 60 మంది వరకు వచ్చారు. మీటింగ్ రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడారు. అనేక మంది వ్యక్తిగతంగా విరాళాలు ప్రకటించారు. ఇంకొందరు బ్యాచ్ వైజ్ గా కలెక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా అన్ని వయసుల వారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజంగా ఖమ్మం లో సన్నాహక సమావేశం జరుపుక పోయి ఉంటే అది ఒక పెద్ద తప్పిదం అయి ఉండేది. పాల్గొన్న ప్రతి ఒక్కరు మధిర మరియు మధిర జూనియర్ కళాశాల తో ఉన్న తమ అనుబంధాన్ని, తమ జీవితాలను తీర్చి దిద్దిన గురువులను గుర్తు చేసుకున్న తీరు అందరి మనసులను హత్తుకుంది. ఏది ఏమైనా ఈ సన్నాహక సమావేశం ఖమ్మం లో నివాసం ఉంటున్న మధిర జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధుల మధ్య కొత్త బంధాన్ని నెలకొల్పింది.
Thanks to all who were present in today’s preparatory meeting and expressed their feelings and showing interest to come to Madhira on June 8th.
We also thank the New Vision Junior College Management for providing meeting hall with AC along with some Tea and some snacks
Thank you.
PS: ఇదే తరహా మీటింగ్ నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లో కూడా జరపాలి అనే ప్రయత్నం జరుగుతున్నది. Date will be intimated once all arrangements are made.

FB