- June 4, 2025
- By gjcmadhira
- Latest News
విలేకరుల సమావేశం మధిర:
ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ నెల 8వ తేదీ ఆదివారం నాడు జరగనున్నాయి.
దీనికి సంబంధించి ఏర్పాట్ల నిర్వహణపై ఈ రోజు అనగా ది 04-6-2025 ఉదయం. 11 గంటలకు ప్రెస్ మీట్ (విలేకరుల సమావేశం) ఏర్పాటు చేయనైనది.
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలను చరిత్రలో నిలిచేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం స్థానిక సితార గ్రాండ్ లో నిర్వహణ కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ కళాశాల ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవాలను ఈనెల 8వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1970లో మధిర జూనియర్ కాలేజీ నిర్మాణం జరిగిందని అప్పటినుండి ఈ కళాశాలలో సుమారుగా 17 నుంచి 20వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారన్నారు.ఈ కళాశాలలో చదివిన పలువురు విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగారని, వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా అనేక రంగాల్లో స్థిరపడి దేశ విదేశాల్లో పలు సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. కళాశాలలో వేలాదిమంది విద్యార్థులకు విద్యా బోధన చేసిన అధ్యాపకులను గౌరవించాల్సిన బాధ్యత నిర్వాహక కమిటీ సభ్యులుగా తమపై ఉన్నదని, దీనిలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు పూర్వ విద్యార్థులతోపాటు, అధ్యాపకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు తెలిపారు.దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ పూర్తయినట్లు తెలిపారు.స్వర్ణోత్సవాలను విజయవంతం చేసేందుకు 75 మంది పూర్వ విద్యార్థులతో ఐదు కమిటీలు ఫుడ్ కమిటీ, కల్చరల్ కమిటీ, సావనీర్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ లను ఏర్పాటు చేయడం జరిగిందని వారంతా వారి బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నట్లు వారు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణలో ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా పలు చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. కొన్ని వేల మంది విద్యార్థులు ఉల్లాసంగా గడపటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కారు పార్కింగ్ కు ప్రత్యేక స్థలం కేటాయించినట్లు తెలిపారు. వివిధ బ్యాచులవారు ప్రత్యేకంగా ఉండడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు దేశ, విదేశాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ హాజరై జయప్రదం చేయాలని వారు సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర రావు, అద్దంకి విప్లవ కుమార్, మల్లాది వాసు, బెజవాడ రవిబాబు, బోయపాటి వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి, బోజడ్ల అప్పారావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వంకాయలపాటి శంకర్ రావు, మిరియాల రమణ గుప్తా, ఎం ఏ రహీం, మక్కెన నాగేశ్వరరావు, మువ్వా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



FB