- June 2, 2025
- By gjcmadhira
- Latest News
హైదరాబాద్ సన్నాహక సమావేశం విశేషాలు
నిన్న అనగా 01.06.2025 ఆదివారం నాడు హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర స్వర్ణోత్సవ వేడుకల సన్నాహక సమావేశం విజయవంతంగా ముగిసింది.
ఈ సమావేశంలో వివిధ బ్యాచ్ లకు చెందిన దాదాపు 50 మందికి పైగా పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.
ఈ సన్నాహక సమావేశపు విశేషాలు:
వివిధ రంగాలలో ప్రసిద్ధి గాంచిన పూర్వ విద్యార్ధులు దాదాపు 50 మందికి పైగా పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు వేదికపై మాట్లాడారు. మధిర జూనియర్ కళాశాల తో ఉన్న తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
వచ్చిన ప్రతి ఒక్కరు జూన్ 8 స్వర్ణోత్సవ సంబరాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
అద్భుతమైన మైక్రో ప్లానింగ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ ను అభినందించారు.
దూరంగా ఉన్నప్పటికీ ఏదైనా సర్వీస్ అవసరమైతే చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఆర్గనైజింగ్ కమిటీ కి తెలిపారు
అమోఘమైన ఈ చారిత్రిక ఘట్టానికి తమ వంతుగా ఆర్థిక సహకారం చేస్తామని హామీనిచ్చారు. కొంతమంది అక్కడికక్కడే స్కానర్ ద్వారా అమౌంట్ కొట్టటం జరిగింది.
వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్ అధినేత శ్రీ చావా శ్రీనివాస రావు గారు తన వంతుగా ఆర్థిక సహకారం తో పాటు తమసంస్థ నుండి ఒక sweet box ను స్వర్ణోత్సవ వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వటానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదములు
ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు శ్రీ బోయినపల్లి కృష్ణమూర్తి గారు తమ వంతుగా ఆర్థిక సహకారం చేస్తామని హామీనిచ్చారు
హైదరాబాద్ లో ప్రముఖ చిట్ ఫండ్ వ్యాపారవేత్త, మడుపల్లి వాస్తవ్యులు శ్రీ చెరుకూరి వెంకటేశ్వర రావు గారు వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ లేదా కమిటీ వారికి ఆర్థిక విరాళం చేయటానికి ముందుకు వచ్చారు.
హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశం ఒక చారిత్రిక ఘట్టానికి తెర తీసింది. మన జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఒక వెబ్ సైట్ ను ఆవిష్కరించుకోవటం జరిగింది. GJC మధిర పేరుతో సృష్టించబడిన ఈ వెబ్సైట్ ను NRI శ్రీ పి. శ్రీనివాస్ గారు ఐర్లాండ్ ఎన్నో వ్యయ ప్రయాసలతో తయారు చేశారు. వివిధ రకాల విశేషాలు, ఫోటోలతో వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఈ వెబ్సైట్ ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ను 1970 బ్యాచ్ కు చెందిన సీనియర్ పూర్వ విద్యార్థి శ్రీ చల్లా పిచ్చయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. Please follow the GJC Madhira website at https://gjcmadhira.com for regular updates on our Golden Jubilee Celebrations
ఈ మొత్తం కార్యక్రమాన్ని మన పూర్వ విద్యార్ధులు, మిత్రుడు శ్రీ కర్నాటి ఫణి కుమార్, హై కోర్టు అడ్వకేట్ శ్రీమతి నారుకొండ ఇంద్రాణి గార్లు స్పాన్సర్ చేశారు. వారికి ధన్యవాదములు
PS: పాల్గొన్న అనేకమంది తో వాయిస్ ఓవర్ వీడియో తీసుకోవటం జరిగింది. ఆ వీడియోస్ ను త్వరలో మన యూట్యూబ్ ఛానల్ లో upload చేయటం జరుగుతుంది

FB
1 Comment
కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదములు వారు తమ తమ పనులను అన్నిటినీ వదిలిపెట్టి మన పూర్వ విద్యార్థుల కలయిక కోసం చాలా సమయాన్ని కేటాయిస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదములు.,..
మనోహర్ 1983