GJC Alumni Madhira
GJC Alumni Madhira
  • Home
  • Join Alumni
  • Events
  • News
  • Gallery
  • Volunteers
  • Contact Us
  • FBFB
  • Home
  • Join Alumni
  • Events
  • News
  • Gallery
  • Volunteers
  • Contact Us
  • FBFB
  • February 16, 2025
  • By gjcmadhira
  • Latest News

స్వర్ణోత్సవాల సన్నాహక సమావేశం 16-02-2025

ఈ రోజు అనగా 16.02.2025 ఆదివారం నాడు మన ప్రోగ్రామ్ కి సంబంధించిన సన్నాహక సమావేశం TVM హైస్కూల్ మధిరలో జరిగింది. దీనికి వివిధ బ్యాచిలకు చెందిన పూర్వవిద్యార్ధులు దాదాపు 50 మందికి పైగా పాల్గొన్నారు.

ఇది కాక 1970 బ్యాచ్ వారు ఒక 12 మంది విడిగా కూర్చున్నారు. అత్యంత ఉత్సాహ పూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు తమ సలహాలు సూచనలు ఇచ్చారు. మనం జరుపబోయే Grand Get Together ను నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఒక Life Time Event గా జరపాలని, అందుకు అన్ని విధాలుగా తమ సహకారాన్ని అందిస్తామని పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో అందరూ ఆమోదించి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు కింద పేర్కొనబడినవి:

1) మనం జరుపబోయే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ plus Grand Get Together ను రెంటినీ కలిపి స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం గా జరుపుకోవాలని నిర్ణయించనైనది.
2) మన గ్రాండ్ ఈవెంట్ ను వివిధ సూచనలు అనగా టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్, వాల్యుయేషన్ ఇతరత్రా కారణాలతో మే మొదటి లేదా రెండోవారంలో జరుపుటకు నిశ్చయించనైనది.
3) దీనికి సంబంధించిన విధి విధానాలు రాబోయే సమెవేశాల్లో నిర్ణయించటం జరుగుతుంది.
4) మన ఈవెంట్ కు సంబంధించి అవసరమయ్యే ఖర్చుల గురించి, నిధుల సమీకరణ గురించి next meeting లో చర్చించబడును.
5) మన ఈవెంట్ నిర్వహణ కోసం ప్రతి ఒక్క బ్యాచ్ నుండి 4గురు వ్యక్తులు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించనైనది. ఆ నలుగురి పేర్లు గ్రూప్ లో ప్రకటించబడును.
6) ఆ నలుగురు బాధ్యులు తమ బ్యాచ్ లోని వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్స్ సేకరించి వారిని వాట్సాప్ గ్రూప్ లో add చేయాలి.
7) Golden Jubilee Grand Get Together Celebrations ను స్థానిక పత్రికా మాధ్యమంలో, సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం చేయాలి.
8) పోస్టర్స్, వాల్ పేపర్స్, ఫ్లయర్స్, రీల్స్, షార్ట్స్ తయారుచేసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం చేయాలి.
9) మన ఈవెంట్ ప్రచారం లో భాగంగా ఒక లోగో ఆవిష్కరించాలని నిర్ణయించనైనది. (లోగో సిద్ధమైంది. స్వల్ప మార్పులతో త్వరలో విడుదల చేయబడును. (Logo Created by P Srinu 1987-89 batch).
10) ఈవెంట్ కు హాజరయ్యే మన పూర్వ విద్యార్ధుల వివరాలను సేకరించడానికి (పొందుపరచడానికి) ఒక Google sheet ను whatsapp గ్రూప్ లో రేపు లేదా ఎల్లుండి రిలీజ్ చేయబడును. (Google Sheet is prepared by Arun USA 1995-97 Batch ).
11) మన ఈవెంట్ ప్రచారంలో భాగంగా ఒక Facebook page ను మరియు Youtube Channel క్రియేట్ చేయాలని నిర్ణయించనైనది.
12) తర్వాతి సమావేశం ఒక పక్షం రోజుల్లో జరపాలని నిర్ణయించనైనది.
13) పూర్వ విద్యార్థి సంఘం పేరిట ఒక ట్రస్ట్ లేదా సంస్థ ఏర్పాటు చేయాలి అనే సూచన వచ్చినప్పటికీ ప్రస్తుతానికి మన ఈవెంట్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయాలని నిర్ణయించనైనది.మనం జరుపబోయే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ plus Grand Get Together ను రెంటినీ కలిపి స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం గా జరుపుకోవాలని నిర్ణయించనైనది.

Recent Posts

  • GOLDEN JUBILEE CELEBRATIONS PROGRAM SHEET
  • విలేకరుల సమావేశం మధిర:
  • హైదరాబాద్ సన్నాహక సమావేశం విశేషాలు
  • సర్వోత్సవాలు వేడుకలు
  • Government Junior College, Madhira, First principal and First Lecturer

Recent Comments

  1. Manohar on హైదరాబాద్ సన్నాహక సమావేశం విశేషాలు
Copyright © 2025 gjcmadhira.com All rights reserved.

Sign Up

Already registered? Log in here

Or

Login

Don 't have an account ? Sign Up
Or

Reset Password

Back To Login