- June 1, 2025
- By gjcmadhira
- Latest News
GJC మధిర, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, హైదరాబాద్ సన్నాహక సమావేశం 01.06.2025 ఆదివారం
ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా జరిగే అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికై ఒక సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది.
ప్రియమైన మధిర జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులకు, ( హైదరాబాద్ వాస్తవ్యులకు)
మన కళాశాల ఆవిర్భావానికి స్వర్ణోత్సవం – ఇది మన అందరి జీవితాల్లో ఓ స్మరణీయమైన ఘట్టం. 1970 నుండి 2025 వరకు మన కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ప్రతి పూర్వ విద్యార్థి మధిర జూనియర్ కళాశాల గర్వకారణం.
ఈ అద్భుత సందర్భాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముందుగా ఒక సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
మీరు తప్పక హాజరు కావలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అలాగే ఈ సందేశాన్ని ఈ గ్రూప్‌లో లేని మీ పరిచయంలోని ఇతర పూర్వ విద్యార్థులకు చేరవేసి, వారిని కూడా హాజరు అయ్యేలా చూడగలరని వినమ్రంగా కోరుతున్నాము.
వేదిక: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC), జూబ్లీహిల్స్, హైదరాబాద్
తేదీ: 2025 జూన్ 1, సమయం: ఉదయం 9:30 గంటలకు
ఈ సమావేశం మన వివిధ బ్యాచ్‌ల సీనియర్లు మరియు జూనియర్ల అపూర్వ కలయికకు వేదికగా నిలుస్తుంది. మన బాల్యం, విద్యార్థి దశ, అభిరుచి, ఆశయాలన్నింటినీ మళ్లీ ఒక్కసారిగా గుర్తుచేసుకుంటూ, ఆత్మీయ అనుభూతులను పంచుకునే స్వర్ణావకాశం ఇది.
మీ ఆగమనాభిలాషులు,
ఆర్గనైజింగ్ కమిటీ
మధిర జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు.

FB