- June 1, 2025
- By gjcmadhira
- Latest News
Government Junior College, Madhira, First principal and First Lecturer
Government Junior College, Madhira was established in the year 1970.
Sri K. Krishnama Charyulu garu, The first principal of the Government Junior College Madhira
Sri jalagam Bhadraiah garu, first lecturer in economics at the Government Junior College Madhira
Current Principal
B JAYADASS
అ’పూర్వ కలయిక’
నిన్న మొన్నటి వరకూ మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ‘పూర్వ విద్యార్థుల కలయిక ‘కల’ ఇక’ అనుకున్నాం. ఆశలన్నీ వదిలేసుకున్నాం. కారణం ఐదేళ్ల కిందట, యాభయ్యేళ్లు రాగానే చేసిన ప్రయత్నాలన్నీ కరోనా కల్లోలంతో కొలిక్కి రాకుండా కొండెక్కడమే. అలాంటిది ఉన్నపళాన ఊహించని రీతిలో పాతిక జట్ల పూర్వ విద్యార్థులను పోగుచేసి, పాతిక రోజుల్లోనే ప్రప్రధమ కలయికను కార్యరూపంలోకి తేవడం, ‘గోల్డెన్ జూబిలీ’కి తెరలేపడం మన మధిర మహానుభావులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదేమో! ఇందుకు ముందుగానే మార్గం సుగమం చేసిన 1985-87 జట్టు కూడా అభినందించదగినది.
యాభై ఐదేళ్ళ ఘన చరిత్ర కలిగి న మధిర ప్రభుత్వ కళాశాలలో, పచ్చని చెట్లమధ్య ప్రకృతి ఒడిలో పరవశించి, ఆ చదువుల తల్లి కరుణా కటాక్ష వీక్షణలతో ఎన్నో ఉన్నత శిఖరాలనధిరోహించిన సరస్వతీ పుత్రులంతా నేడు ఒక్కతాటిమీదికొచ్చి,
బాల్యపు బంగారు స్మృతులను నెమరేసుకుంటూ ‘విద్యా ప్రదాత(ల)’కు వినమ్రంగా ప్రణమిల్లుతుండటం, యాభయ్యేళ్ల వసంతోత్సవాన్ని ఉవ్వెత్తున ఎగసిన సంతోషకెరటాలతో అభిషేకించబోతుండటం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఇది మధిర కాలేజీ విద్యార్థుల జీవితాల్లో మధురమైన ఉత్సవమై చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. అంతటి అ’పూర్వ’ ఆనందోత్సవంలో మేమూ భాగస్వాములవుతుండటం మా అదృష్టం.
మీ ‘సిల్వర్ జూబ్లీ’ జట్ల
అ’పూర్వకలయిక’తో జరుపుతోన్న ఈ
‘గోల్డెన్ జూబ్లీ’ వేడుక కాలేజీ చరిత్రలో మొట్ట మొదటిది మాత్రమే కాదు, ఓరకంగా చిట్ట చివరిది కూడా. ఎందుకంటే పక్కనే నిర్మాణంలో ఉన్న కాలేజీ బిల్డింగ్ పూర్తయితే, మీ కాలపు క్లాసు రూములన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఆ కాలపు తీపి గుర్తులేవీ మిగలవు. కాలేజీ స్థానే ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్’ వస్తోంది. ఇప్పటికైనా మీరంతా ఒక్కటై వేడుక చేసుకుంటున్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ఈ కాలేజీకి మనసున్న మధిర ప్రముఖులైన మీరంతా అ’పూర్వ’ విద్యార్ధులే కాబట్టి మీ అందరి అవ్యాజమైన అనుబంధానురాగాల అండతో, అన్ని సౌకర్యాలతో అత్యుత్తమ విద్యనందిస్తూ అజరామరంగా వర్ధిల్లాలని ఆశిస్తూ.. మీ
-ప్రిన్సిపాల్
బట్టేపాటి జైదాస్.

FB